సీఎం జగన్‌ సార్‌.. సేవ్‌ ఏపీ పోలీస్‌

పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి పోలీసులకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, టీఏ, డీఏలు, ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎస్‌ఎల్‌ఎస్‌ బకాయిలు ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు.

Published : 03 Oct 2022 03:01 IST

మాజీ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ సైకిల్‌ యాత్ర

అడ్డుకున్న పోలీసులు

టీఏ, డీఏలు రాక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన

అనంతపురం కమలానగర్‌, న్యూస్‌టుడే: పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి పోలీసులకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, టీఏ, డీఏలు, ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎస్‌ఎల్‌ఎస్‌ బకాయిలు ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. ‘ఏపీ సీఎం జగన్‌ సార్‌, సేవ్‌ ఏపీ పోలీస్‌, గ్రాంట్స్‌, ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎస్‌ఎల్‌ఎస్‌, టీఏ, డీఏలు, నన్ను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోండి, సామాజిక న్యాయం చేయండి ప్లీజ్‌’.. అనే ప్లకార్డును సైకిల్‌కు కట్టి, ఆదివారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌ నుంచి నగరంలో సైకిల్‌ యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు వచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కక్షగట్టి బకాయిలు, టీఏ, డీఏలు ఇవ్వడం లేదని చెప్పారు. బకాయిలు రాకపోవడంతో పండగ సందర్భంగా పోలీసులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 358 మంది పోలీసులను వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించారని చెప్పారు. తాను బకాయిలు అడిగినందుకు విధుల నుంచి తప్పించారని ప్రకాశ్‌ తెలిపారు. సైకిల్‌ యాత్రకు అనుమతి తీసుకోకపోవడం వల్లనే ప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశామని అనంతపురం మూడో పట్టణ ఎస్సై వలీబాషా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని