అక్షరాభ్యాసం చేసిన 3వేల మంది చిన్నారులు

విజయనగరం జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతీ ఆలయం ఆదివారం కిక్కిరిసింది. మూలానక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసాలు చేయించేందుకు దాదాపు 3,000 మంది చిన్నారులతో కలిసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు.

Published : 03 Oct 2022 03:01 IST

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతీ ఆలయం ఆదివారం కిక్కిరిసింది. మూలానక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసాలు చేయించేందుకు దాదాపు 3,000 మంది చిన్నారులతో కలిసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు చేరుకుని సరస్వతీదేవి, మహాలక్ష్మి, భువనేశ్వరీదేవిని దర్శించుకున్నారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం తాతాచార్యులు, బృందావనం రామ్‌గోపాలాచార్యులు ఆధ్వర్యంలో తులాభార సేవ జరిగింది. భక్తులకు ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనాలు అందించినట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెరుకూరి శ్రీధర్‌, జి.శ్రీనివాసరావు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని