SP Balasubrahmanyam: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు
ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆయన అభిమానులు గుంటూరులో ఏర్పాటుచేయగా, అనుమతులు లేవంటూ నగరపాలక సంస్థ మరునాడే తొలగించింది.
అనుమతి లేదన్న నగరపాలక సంస్థ
ఈనాడు-అమరావతి, గుంటూరు సాంస్కృతికం-న్యూస్‌టుడే: ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆయన అభిమానులు గుంటూరులో ఏర్పాటుచేయగా, అనుమతులు లేవంటూ నగరపాలక సంస్థ మరునాడే తొలగించింది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి తెలియజేసే, ఆదివారం రాత్రి మిత్రుల సహకారంతో విగ్రహాన్ని లక్ష్మీపురం సెంటర్లోని మదర్ థెరెస్సా కూడలికి చేర్చామని కళాదర్బార్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు చెప్పారు. సోమవారం ఉదయం వెళ్లిచూడగా అక్కడి నుంచి తొలగించి, నగరపాలిక వాటర్ ట్యాంకర్ల ప్రాంగణంలో పడేశారని వాపోయారు. ‘విగ్రహం తొలగించవద్దంటూ అక్కడున్నవారు ప్రాధేయపడినా అధికారులు విన్లేదు. నగరంలో ట్రాఫిక్ రద్దీగా ఉండే డివైడర్లు, కూడళ్లల్లో నేతల విగ్రహాలను కొనసాగిస్తూ, బాలు విగ్రహాన్ని తొలగించడమేంటి? రాకపోకలకు అడ్డుగా లేనిచోటే పెట్టాం. ఇంకా ముసుగు తొలగించలేదు. అనుమతి కోసం మేం రెండేళ్లుగా తిరుగుతున్నా, అధికారులు స్పందించలేదు’ అని రంగారావు పేర్కొన్నారు. దీనిపై కార్పొరేషన్ ప్రణాళికాధికారి జీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ‘కోర్టుల ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, రహదారుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. బాలు విగ్రహం పెట్టిన ప్రదేశం నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. దానికి అనుమతి లేనందునే తొలగించామ’ని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్ల జారీ!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే. -
జగన్ సర్కారును పెకలించేేద్దాం
రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే సర్కారును తెచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. -
ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు!
అవినీతి అక్రమాలపై చెడుగుడు ఆడే పాశుపతాస్త్రం.. ఓటు. పరమ పవిత్రమైన ఓట్లు జగనన్న పాలనలో పప్పుబెల్లాలు అయ్యాయి. వక్రబుద్ధి మరవని జగన్.. తన పాలనకు మడుగులొత్తే అధికారుల అండతో లెక్కకు మిక్కిలి దొంగ ఓట్లను నమోదు చేయించి.. ఓటు విలువను అభాసుపాలు చేశారు. -
ప్రశ్నలను తెలుగులో అను‘వధించారు’
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేెలెత్తించాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలోనూ తప్పులు దొర్లాయి. -
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
టెట్ ఫలితాల విడుదల ఎప్పుడో?
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ‘కీ’లను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నాయి. -
ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. మైకుల మొరాయింపు
బొప్పూడి ‘ప్రజాగళం’ సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే నాలుగుసార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. -
విశాఖలో ‘భారత్ నివేష్ రన్’
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో ‘భారత్ నివేష్ రన్’ పేరిట 5కే రన్ నిర్వహించారు. -
మోదీజీ.. అమరావతిని కాపాడండి
అయిదు సంవత్సరాల నుంచి చస్తూ బతుకుతున్న అమరావతి... మోదీజీ రాజధానికి రండి.. ఆంధ్రాను రక్షించండి.. అమరావతి రైతుల జీవితాలను కాపాడండి.. మా బాబు, మన మోదీ, మా పవన్... ఇకపై ఆంధ్రాకు, అమరావతికి అమృతమే.. -
జజ్జనకరి జనారే.. సభంతా హుషారే
‘ప్రజాగళం’ సభ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘పసుపు దళపతి.. చీకటిని పారదోలే అధిపతి’ అంటూ సాగే పాటకు జనం ‘జై బాబు.. జైజై బాబు’ అంటూ నినాదాలు చేశారు. -
ఉప్పొంగిన జన సంద్రం
ఎటు చూసినా జనం.. కోటప్పకొండ జాతరను మించిన జన జాతర.. సభా ప్రాంగణంలోని గ్యాలరీల్లో జనం.. రోడ్లపైనా వెల్లువలా ప్రజలు.. తెదేపా, జనసేన, భాజపాల మధ్య పొత్తు కుదిరాక మూడు పార్టీలూ సంయుక్తంగా బొప్పూడి వద్ద నిర్వహించిన తొలి సభ దిగ్విజయమైంది.. -
ప్రధాని సభలో భద్రతా వైఫల్యం
ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించటంలో విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
ప్రేక్షకపాత్రకే పరిమితమైన పోలీసులు
ప్రధాని రాకకు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు సైతం సభ నిర్వహణలో బందోబస్తుపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశాయి. అప్పుడూ పోలీసులు స్పందించలేదు. -
మీ ప్రాణాలు మాకెంతో విలువైనవి.. టవర్లు దిగిరండి
‘ప్రజాగళం’ బహిరంగ సభలో సౌండ్ సెట్టింగ్‌కు ఏర్పాటుచేసిన టవర్లను ఎక్కిన యువకులంతా వాటిని దిగి కిందికి రావాలని ప్రధాని మోదీ పదేపదే విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగించే సమయంలో టవర్లపై కొందరు యువకులున్న విషయాన్ని గమనించిన మోదీ.. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చీరల పంపిణీ
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వైకాపా నాయకులు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆదివారం అమరావతిలో ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
రాఘవాచారి సంపాదకీయాలు సమకాలీన పరిస్థితులకు దర్పణం
సమకాలీన రాజకీయాలు, పరిస్థితులకు చక్రవర్తుల రాఘవాచారి సంపాదకీయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.గిరిజాశంకర్ అన్నారు. -
నామిని రచనల్లో సామాన్యుల జీవితాలు
‘‘నామిని రచనల్లో ‘మిట్టూరోడి కథలు’ సామాన్యుల జీవనాన్ని ప్రతిబింబించాయి. నేటి రచయితలు అనేకమంది నాన్న ప్రేమను, ఆయన శ్రమను కథలుగా రాస్తే, నామిని మాత్రం తన రచనల్లో అమ్మ శ్రమను ఆవిష్కరించారు’’ అని మాజీ మంత్రి, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ గల్లా అరుణకుమారి అన్నారు. -
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజీనామా
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసేపల్లిపాడుకు చెందిన లింగంగుంట రవిబాబు తన పదవికి, వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఏపీ ఫైబర్‌నెట్‌లో సీఎం జగన్ ప్రత్యక్షం.. ఎన్నికల కోడ్ వర్తించదా?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేస్తున్నారు. ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సీఎం జగన్ చిత్రపటాలను తీసేస్తున్నారు. -
రాజకీయ పార్టీల హోర్డింగ్‌లు వెంటనే తొలగించండి
ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ పార్టీల హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. -
ఒకసారే మూల్యాంకనం చేశాం
గ్రూపు-1 (2018) ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Maldives Parliament Elections: మాల్దీవుల్లో ఎన్నికలు.. భారత్‌కు బ్యాలెట్ బాక్సులు..!
-
BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసిన భారాస నేతలు
-
Elvish Yadav: పాము విషం ఏర్పాటు చేశా.. కీలక విషయాలు వెల్లడించిన బిగ్‌బాస్ ఓటీటీ విజేత..!
-
Atchannaidu: ప్రభుత్వ వెబ్సైట్లలో జగన్ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు
-
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు