ఇలా సర్దుబాటు.. అలా నిలుపుదల

గనుల శాఖలోని రెండు జిల్లాలకు చెందిన సహాయ సంచాలకులను పని సర్దుబాటు (వర్క్‌ ఎడ్జెస్ట్‌మెంట్‌)కింద బదిలీ చేయగా, మూడు రోజుల్లోనే ఆ ఉత్తర్వులను నిలిపేయడం

Published : 05 Oct 2022 03:45 IST

అనంత, చిత్తూరు గనులశాఖ ఏడీలను మార్చి, ఆపేసిన వైనం

ఈనాడు-అమరావతి: గనుల శాఖలోని రెండు జిల్లాలకు చెందిన సహాయ సంచాలకులను పని సర్దుబాటు (వర్క్‌ ఎడ్జెస్ట్‌మెంట్‌)కింద బదిలీ చేయగా, మూడు రోజుల్లోనే ఆ ఉత్తర్వులను నిలిపేయడం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం ఏడీగా పనిచేస్తున్న తోట బాలసుబ్రమణ్యాన్ని చిత్తూరుకు, చిత్తూరులో ఏడీగా పనిచేస్తున్న పి.ప్రకాశ్‌కుమార్‌ను అనంతపురానికి పని సర్దుబాటు కింద బదిలీచేస్తూ గత వారం గనులశాఖ అధికారులు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. వారిద్దరూ కొత్త కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టకుండానే.. మూడు రోజుల్లోనే ఆ బదిలీలను నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 15 రోజుల పాటు ఆదేశాలను పెండింగ్‌లో పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. బాలసుబ్రమణ్యం చిత్తూరు ఏడీగా వస్తే.. నిబంధనలు అమలు పేరిట ఇబ్బందులు పడతామంటూ కొందరు గ్రానైట్‌ లీజుదారులు ఓ మంత్రిని కలిసి చెప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన చిత్తూరుకు రాకుండా ఆదేశాలను పెండింగ్‌లో పెట్టారని గనులశాఖలో చర్చ జరుగుతోంది. గతంలో బాలసుబ్రమణ్యం ఒంగోలులో ఏడీగా పనిచేసిన కొద్ది రోజుల్లోనే.. అక్కడి గ్రానైట్‌ క్వారీలు, పరిశ్రమల యజమానులూ ఒత్తిళ్లు తెచ్చి జిల్లాకు చెందిన ఓ నేత ద్వారా ఆయన్ను బదిలీ చేయించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts