కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి.

Updated : 05 Oct 2022 05:09 IST

ఈనాడు-అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, చాలాచోట్ల తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వివరించారు. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, నంద్యాల, కాకినాడ, వైఎస్సార్‌, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పల్నాడు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటినుంచి మోస్తరు వానలు కురిశాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts