అశ్వవాహన సేవలో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన అశ్వవాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొన్నారు.

Updated : 05 Oct 2022 04:57 IST

ఈనాడు, తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన అశ్వవాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఆయన కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకోగా.. వాహన మండపం ప్రాంతంలో తితిదే ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహకిశోర్‌ స్వాగతం పలికారు. అక్కడ స్వామిహారతి తీసుకున్నారు. అనంతరం మాడ వీధుల్లో స్వామి వాహనంతో పాటు నడిచారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, ఝార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డా.రవిరంజన్‌ పాల్గొన్నారు.

పెద్ద జియ్యంగార్‌కు మొక్కి..
వాహనం వద్దకు చేరుకునే సమయంలో అక్కడే ఉన్న పెద్ద జియ్యంగార్‌కు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మాడ వీధుల్లోని కళాకారులను ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం చక్రస్నాన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని