మహిషాసురమర్దినిగా దుర్గమ్మ

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మంగళవారం మహిషాసురమర్దినిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 05 Oct 2022 04:58 IST

ఈనాడు, అమరావతి: దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మంగళవారం మహిషాసురమర్దినిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పటివరకూ తొమ్మిది రోజుల వేడుకల్లో.. పది లక్షల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారంతో దసరా వేడుకలు ముగియనున్నాయి. చివరి రోజు రాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ భక్తులకు అభయప్రదానం చేస్తారు. సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.


సిద్ధిదాయిని అలంకారంలో భ్రమరాంబాదేవి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. తొమ్మిదోరోజు మంగళవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. దేవదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ కూడా పాల్గొన్నారు.  అనంతరం ఆలయ పుష్కరిణిలో దాతల సహకారంతో నిర్మించిన నీరాజన మండపాన్ని మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి భక్తులకు సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్ఠింపజేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు చేశారు. స్వామిఅమ్మవార్లకు శ్రీగిరి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని