అశ్వ వాహనంపై మలయప్పస్వామి అభయప్రదానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వ వాహనాన్ని అధిరోహించి కల్కి అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. ఉదయం శ్రీ మలయప్పస్వామివారు దేవేరులతో కలిసి బ్రహ్మరథం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు.

Updated : 05 Oct 2022 04:51 IST

నేడు శ్రీవారి చక్రస్నానం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వ వాహనాన్ని అధిరోహించి కల్కి అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. ఉదయం శ్రీ మలయప్పస్వామివారు దేవేరులతో కలిసి బ్రహ్మరథం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేకువజామున 3 నుంచి 6గంటల వరకు పల్లకీ, తిరుచ్చి ఉత్సవాల్ని నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వార్‌కు వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు. ఈ ఘట్టం ఉదయం 6 నుంచి 9గంటల మధ్య చేపడతారు. రాత్రి 7 నుంచి 9గంటల మధ్య జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. గురువారం నుంచి శ్రీవారి సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని