నాటు పడవలే నేటికీ గతి!

గోదావరి నదికి వరద వచ్చిందంటే చాలు.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంక పంచాయతీ చుట్టూ ప్రవాహం చేరుతుంది. గ్రామస్థులు బాహ్య ప్రపంచానికి రావాలంటే నాటు పడవలే గతి.

Published : 05 Oct 2022 03:45 IST

గోదావరి నదికి వరద వచ్చిందంటే చాలు.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంక పంచాయతీ చుట్టూ ప్రవాహం చేరుతుంది. గ్రామస్థులు బాహ్య ప్రపంచానికి రావాలంటే నాటు పడవలే గతి. అవీనూ స్థానికులు సొంతంగా ఏర్పాటు చేసుకున్నవే. వరద ఉద్ధృతి ఎక్కువుంటే ఓ పక్షం రోజులు ప్రభుత్వం లాంచీ నడుపుతుంది. మిగతా రోజులు నాటు పడవలనే ఆశ్రయిస్తుంటారు. మొదట్లో ఇక్కడ 4 వేలకుపైగా జనాభా ఉండేది.  ముంపు ప్రభావంతో ఒక్కొక్కరు ఊరొదిలి వెళ్లిపోగా.. ఇప్పుడు 700 మంది మిగిలారు. నాటు పడవలతో ప్రమాదాలు జరుగుతున్నా ప్రత్యామ్నాయం లేక విద్యార్థులూ వాటినే ఆశ్రయిస్తున్నారు. రెండు పడవల నిర్వహణకు ఏటా రూ.4లక్షలు ఊరి వాళ్లే భరిస్తున్నారు. 2019లో రూ.35 కోట్లతో వంతెన నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. రెండున్నరేళ్ల నుంచి నత్తనడకగానే పనులు సాగుతున్నాయి. వంతెన పూర్తిచేసేందుకు 6 నెలల చొప్పున కాలపరిమితిని పెంచుతూ పోతున్నారే తప్ప.. గ్రామస్థుల ఇబ్బందులు మాత్ర పట్టించుకోవడం లేదు.  

- న్యూస్‌టుడే, సీతానగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని