గాన గంధర్వుడికి ఇదా స్థానం?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి తీరని అవమానం జరిగింది.. అనుమతిలేనిచోట నెలకొల్పారంటూ ఆయన విగ్రహాన్ని తొలగించిన గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు దానిని తీసుకువెళ్లి ఓ టాయ్‌లెట్‌ డబ్బా ఆసరాతో నిలిపి ఉంచడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 05 Oct 2022 04:50 IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి తీరని అవమానం జరిగింది.. అనుమతిలేనిచోట నెలకొల్పారంటూ ఆయన విగ్రహాన్ని తొలగించిన గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు దానిని తీసుకువెళ్లి ఓ టాయ్‌లెట్‌ డబ్బా ఆసరాతో నిలిపి ఉంచడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. సోమవారం బాలు విగ్రహాన్ని తొలగించిన నగరపాలక సంస్థ అధికారులు, మంగళవారం ఉదయం దిమ్మెను పూర్తిగా తీసేశారు. నాజ్‌ సెంటర్‌లో విగ్రహం ఏర్పాటుకు గతేడాది అమరావతి కళాదర్బార్‌ సంస్థకు అనుమతి ఇచ్చామని, అయితే వారు మదర్‌ థెరెసా కూడలిలో అనుమతి లేని ప్రదేశంలో పెట్టడం వల్లనే తొలగించామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చేకూరి కీర్తి మీడియాతో చెప్పారు. దీనిపై అమరావతి కళాదర్బార్‌ కార్యదర్శి బాలస్వామి, సంయుక్త కార్యదర్శి చంద్రబాబు, ఉపాధ్యక్షుడు మురళి మాట్లాడుతూ నాజ్‌ సెంటర్‌లో పెట్టుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారని, అయితే ఆ సెంటర్‌ విస్తీర్ణం కుదిస్తారనే సమాచారంతో భవిష్యత్తులో బాలు విగ్రహాన్ని తొలగిస్తారనే ఉద్దేశంతో వేరేచోట ఏర్పాటు చేశామన్నారు. అధికారుల సూచనల మేరకు నాజ్‌ సెంటర్‌లోనే ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.

- న్యూస్‌టుడే, గుంటూరు కలెక్టరేట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని