నేటి అర్ధరాత్రి నుంచి 2 రోజులు సీఎఫ్‌ఎంఎస్‌ షట్‌డౌన్‌

రాష్ట్రంలో అనేక బిల్లుల చెల్లింపులకు కీలకమైన సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నారు.

Updated : 07 Oct 2022 05:45 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అనేక బిల్లుల చెల్లింపులకు కీలకమైన సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నారు. బిల్లుల ప్రాసెస్‌కు సంబంధించి ఖజానా శాఖ సంచాలకులు మోహన్‌రావు గురువారం రాష్ట్రంలోని అందరు ఖజానా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘కార్యాలయాల్లో పెండింగులో ఉన్న అన్ని బిల్లులను శుక్రవారం రాత్రి ఏడు గంటల లోపు పరిష్కరించాలి. అందరు డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారులు వారి లాగిన్‌లో ఉన్న బిల్లులను శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా పరిష్కరించడమో లేక రద్దు చేయడమో చేయాలి. అనుబంధ బిల్లులు, బకాయిలకు సంబంధించిన బిల్లులు ఈ నెల 11వ తేదీ నుంచి మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది...’ అని మోహనరావు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని