అనధికారికంగా విధులకు డుమ్మా

బోధనాసుపత్రుల్లో పనిచేస్తూ అనధికారికంగా సెలవులు పెట్టి విధులకు దూరంగా ఉంటున్న సుమారు 90 మంది వైద్యులకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సంచాలకుల కార్యాలయం సంజాయిషీ నోటీసులు జారీచేసింది.

Updated : 07 Oct 2022 05:44 IST

90 మంది వైద్యులకు సంజాయిషీ నోటీసులు

ఈనాడు, అమరావతి: బోధనాసుపత్రుల్లో పనిచేస్తూ అనధికారికంగా సెలవులు పెట్టి విధులకు దూరంగా ఉంటున్న సుమారు 90 మంది వైద్యులకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సంచాలకుల కార్యాలయం సంజాయిషీ నోటీసులు జారీచేసింది. వీరిలో కొందరు ఏడాది, మరికొందరు మూడు, నాలుగు నెలల నుంచి విధులకు దూరంగా ఉన్నారు. సూపరింటెండెంట్లకు సమాచారం ఇవ్వకుండా కొందరు విధులకు దూరంగా ఉండటం గమనార్హం. రెండు నెలలకు పైగా విధులకు దూరంగా ఉన్న వారికి ప్రస్తుతం నోటీసులిస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు 15 మంది విధులకు హాజరవుతామని అభ్యర్థనలు ఇచ్చినట్లు ఇన్‌ఛార్జి డీఎంఈ డాక్టర్‌ వినోద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని