అను‘మతిలేని’ నిర్ణయం..!

కాణిపాకంలోని సుప్రసిద్ధ వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం టికెట్‌ ధర పెంపు నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

Updated : 07 Oct 2022 10:06 IST

కాణిపాకంలో అభిషేకం టికెట్‌ ధర పెంపు  
జనాగ్రహంతో వెనక్కు తగ్గిన ఇన్‌ఛార్జి ఈఓ  

కాణిపాకం, న్యూస్‌టుడే, ఈనాడు-అమరావతి: కాణిపాకంలోని సుప్రసిద్ధ వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం టికెట్‌ ధర పెంపు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్వామి మూలవిరాట్టుకు నిత్యం మూడు విడతలుగా పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఆ టికెట్‌ ధరను ఏకంగా రూ. 700 నుంచి రూ. 5,000కు పెంచాలని నిర్ణయించారు. అలాగే రోజుకు ఒక్కసారే అభిషేకం నిర్వహించాలని పేర్కొన్నారు. ఆలయ ఇన్‌ఛార్జ్‌ ఈవోగా ఉన్న దేవాదాయశాఖ జోన్‌-1 ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ (ఆర్‌జేసీ) సురేశ్‌బాబు టికెట్‌ ధర పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం గురువారం నోటీసు బోర్డులో ప్రకటన పెట్టడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తులు, స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పాలకమండలి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టికెట్‌ ధర పెంచడంలేదని పాలకమండలి ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు.

ఇన్‌ఛార్జి ఈవోపై చర్యలు!: టికెట్‌ ధర పెంపు నిర్ణయంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనుమతి లేకుండా ఇలాంటి ప్రతిపాదన సిద్ధం చేసినందుకు ఇన్‌ఛార్జి ఈవో సురేశ్‌బాబుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయనపై అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్‌ దస్త్రాన్ని సిద్ధం చేశారు. ఆయనను బాధ్యతల నుంచి తొలగించాలని కోరుతూ దస్త్రాన్ని ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ)కు పంపారు. సురేశ్‌బాబును తప్పించే వీలుందని దేవాదాయశాఖలో ప్రచారం జరుగుతోంది. అభిషేకం ధర పెంచే ఉద్దేశం లేదని దేవాదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని