కాటన్‌ బ్యారేజికి అంతర్జాతీయ గుర్తింపు

ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా నిలవడంలో కీలక పాత్ర పోషించే తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.

Published : 07 Oct 2022 03:18 IST

ఈనాడు, అమరావతి: ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా నిలవడంలో కీలక పాత్ర పోషించే తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా దీన్ని గుర్తించారు. దేశంలోని మొత్తం నాలుగు సాగునీటి కట్టడాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కగా అందులో కాటన్‌ బ్యారేజి మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజి (ఐసీఐడీ) 24వ అంతర్జాతీయ సదస్సులో దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్‌ రగబ్‌ రగబ్‌ చేతుల మీదుగా ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అందుకున్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ విష్ణువర్థన్‌ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఐసీఐడీ 25వ అంతర్జాతీయ సదస్సు విశాఖ నగరంలో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌ను కూడా కలిశారు. తమిళనాడులోని లోయర్‌ ఆనకట్ట, ఒడిశాలోని బైతరిణి, రుషితుల్య ప్రాజెక్టులకు కూడా ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా గుర్తింపు లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని