అంతరిక్ష వినియోగంలో ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌

శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ గణనీయమైన ప్రగతి సాధిస్తూ అంతరిక్ష వినియోగంలో సుస్థిరత సాధించే దిశగా పయనిస్తోందని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు.

Published : 07 Oct 2022 03:18 IST

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ గణనీయమైన ప్రగతి సాధిస్తూ అంతరిక్ష వినియోగంలో సుస్థిరత సాధించే దిశగా పయనిస్తోందని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి ఇండోర్‌ స్టేడియంలో ఇస్రో, సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, సత్యసాయి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాన్ని బుధవారం గవర్నర్‌ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతికత, ప్రయోజనాలను విద్యార్థులు, సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం అభినందనీయమన్నారు. అంతరిక్ష శిథిలాలను పర్యవేక్షించడానికి ‘ప్రాజెక్టు ఎన్‌ఇటీఆర్‌ఏ’ని ప్రారంభించిందని ఇస్రో ఇక్కడ పేర్కొనడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గవర్నర్‌ను సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, సత్యసాయి విశ్వవిద్యాలయ ఉపకులపతి సంజీవి ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని