పచ్చగా.. పరిశుభ్రంగా...

ఖాళీ స్థలం కనిపించిందంటే కొందరు చెత్తాచెదారం వేస్తూ దుర్గందభరితంగా మారుస్తున్నారు. ఇలాంటి స్థలంలో గుంటూరుకు చెందిన విశ్రాంత వ్యవసాయ అధ్యాపకులు రత్తయ్య మొక్కలు నాటి స్వచ్ఛందంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు.

Published : 07 Oct 2022 03:18 IST

ఈనాడు గుంటూరు: ఖాళీ స్థలం కనిపించిందంటే కొందరు చెత్తాచెదారం వేస్తూ దుర్గందభరితంగా మారుస్తున్నారు. ఇలాంటి స్థలంలో గుంటూరుకు చెందిన విశ్రాంత వ్యవసాయ అధ్యాపకులు రత్తయ్య మొక్కలు నాటి స్వచ్ఛందంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. నగరంలోని కొరిటిపాడు పార్క్‌లో గార్డెనింగ్‌ ఇన్‌ఛార్జిగా 20 ఏళ్లుగా సేవలందిస్తూ పొగడ, వేప, చింత, మర్రి, రావి, గానుగ, కదంబం వంటి 52 రకాలకు చెందిన 2 వేలకు పైగా మొక్కలు పెంచి పార్కును చిట్టడవిలా మార్చారు. చెత్త ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చి.. 500లకు పైగా మొక్కలు పెంచారు. నడకకు వచ్చేవారికి పూర్తిస్థాయి ఆక్సిజన్‌ అందాలని, నగరం పచ్చదనంతో పరిఢవిల్లాలని, అపరిశుభ్రంగా ఉండే చోట్ల ఇలా మొక్కలు నాటితే చెత్తాచెదారం వేయడం మానేస్తారని రత్తయ్య తెలిపారు. ఆర్గానిక్‌ మల్చింగ్‌ పద్ధతిలో సహజ ఎరువుతో త్వరగా చెట్లు పెరిగేలా చేస్తున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts