పెన్షన్ల చెల్లింపు.. ప్రభుత్వ విధాన నిర్ణయం

పెన్షన్ల చెల్లింపు వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) అప్పటి సీఈవో ఇంతియాజ్‌ హైకోర్టులో కౌంటర్‌ వేశారు.

Updated : 07 Oct 2022 05:34 IST

న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు
హైకోర్టులో కౌంటర్‌ వేసిన సెర్ప్‌

ఈనాడు, అమరావతి: పెన్షన్ల చెల్లింపు వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) అప్పటి సీఈవో ఇంతియాజ్‌ హైకోర్టులో కౌంటర్‌ వేశారు. సంక్షేమ పథకాలకు భారీగా సొమ్ము ఖర్చుచేస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న పెన్షన్లకు రాష్ట్రం చెల్లిస్తున్న పెన్షన్లకూ పొంతన లేదన్నారు. అధికంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింస్తోందన్నారు. పింఛను అర్హతను 65 ఏళ్ల నుంచి 60కి కుదించామన్నారు. ఒకే ఇంట్లో పెన్షన్‌కు అర్హత ఉన్నవాళ్లు ఇద్దరు నివశిస్తున్నప్పటికీ జీవో 174 ప్రకారం ఒకరికే పెన్షన్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న వృద్ధులు, వితంతువుల్లో ఒకరికే పింఛను ఇస్తున్నారన్నారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ వేయాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. దీంతో సెర్ప్‌ అప్పటి సీఈవో కౌంటర్‌ వేశారు.  ‘ఒకే ఇంట్లో బహుళ పెన్షన్లకు అనుమతి ఇవ్వడం లేదన్న పిటిషనర్‌ వాదన సరికాదు. వితంతు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చర్మకారులు తదితరులకు నెలకు రూ.2,250 చెల్లిస్తోంది. వికలాంగులకు రూ.3వేలు, తీవ్రమైన కిడ్నీ బాధితులకు రూ.10వేలు చెల్లిస్తోంది. కేంద్రం వృద్ధాప్య పెన్షన్ల కింద నెలకు రూ.200. వితంతువులకు రూ.300, దివ్యాంగులకు రూ.500 మాత్రమే ఇస్తోంది. కేంద్రం ఇచ్చే మొత్తాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో పింఛన్లు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1,596 కోట్లు పింఛన్ల కోసం చెల్లిస్తోంది. ఏడాదికి రూ.19151 కోట్లు ఖర్చుచేస్తోంది. రాష్ట్రంలో 11 రకాల పెన్షన్లను అమలు చేస్తున్నారు. వివిధ జబ్బుల బారినపడిన వారికి అదనంగా మరో 11 రకాల పెన్షన్లను ప్రభుత్వం ఇస్తోంది’ అని కౌంటర్‌లో పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని