బ్రహ్మోత్సవాల్లో 5.69 లక్షల మందికి దర్శనం

తితిదేలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Updated : 07 Oct 2022 06:13 IST

తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడి

ఈనాడు, తిరుపతి: తితిదేలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చి తొలిసారిగా సర్వదర్శనం ద్వారా మాత్రమే శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా శ్రీవారి, వాహన సేవల దర్శనం చేయించినట్లు వెల్లడించారు. తితిదే ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

* బ్రహ్మోత్సవాల్లో తొలి ఎనిమిది రోజులు (సెప్టెంబరు 27-అక్టోబరు 4) 5.69 లక్షలమంది శ్రీవారిని దర్శించుకున్నారు.

* 2.20 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

* 24.89 లక్షల లడ్డూలు విక్రయించాం. హుండీ ద్వారా రూ. 20.43 కోట్ల ఆదాయం లభించింది.

* గదులు ఎక్కడ తీసుకోవాలనే విషయమై భక్తులు ఇబ్బంది పడ్డారు. దీనికి పరిష్కారంగా త్వరలోనే తిరుపతిలో గదుల కేటాయింపును ప్రారంభించనున్నాం. మాడ వీధుల్లోని గ్యాలరీలు ఖాళీగా ఉన్నా ఆ సమాచారం బయటివారికి తెలియలేదు. ఇకమీదట డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి ఆ వివరాలు అందిస్తాం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని