దేవరగట్టులో రక్తమోడిన భక్తులు

దేవరగట్టు కర్రల సమరంలో కొందరు భక్తుల తలలు పగిలి రక్తమోడాయి. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులోని మాళ, మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర బుధవారం అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా కొనసాగింది.

Updated : 07 Oct 2022 06:12 IST

కర్రల ఉత్సవంలో 70 మందికి గాయాలు

హొళగుంద, ఆలూరు గ్రామీణ, ఆలూరు, న్యూస్‌టుడే: దేవరగట్టు కర్రల సమరంలో కొందరు భక్తుల తలలు పగిలి రక్తమోడాయి. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులోని మాళ, మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర బుధవారం అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా కొనసాగింది. కొండపైన మాళ, మల్లేశ్వరస్వామి కల్యాణం అనంతరం జరిగే జైత్రయాత్రను చూసేందుకు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. కొండపై కల్యాణం నిర్వహించి ఉత్సవ విగ్రహాలను కిందకు తీసుకొచ్చారు. ఆ సమయంలో తోపులాట జరిగి కొంతమంది మెట్లపై నుంచి కిందపడ్డారు. జైత్రయాత్రకు బయల్దేరేటప్పుడు కొందరు ఇష్టారాజ్యంగా కర్రలు తిప్పడంతో 70 మందికి గాయాలు కాగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. భారీగా వర్షం కురిసినా మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం ఉత్సాహంతో స్వామివారి వేడుకలు తిలకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని