నా పెంపుడు పులులను రక్షించండి

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్‌ గిరికుమార్‌ పాటిల్‌.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తన రెండు పెంపుడు పులులను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated : 07 Oct 2022 06:11 IST

అవి ఉక్రెయిన్‌లో చిక్కుపోయాయి

కేంద్రానికి తణుకు వైద్యుడి విన్నపం

లండన్‌: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్‌ గిరికుమార్‌ పాటిల్‌.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తన రెండు పెంపుడు పులులను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆయన ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేసేవారు. యుద్ధం మొదలయ్యాక పోలండ్‌కు వలసవెళ్లారు. ఉక్రెయిన్‌లో ఉన్నప్పుడు కీవ్‌ జూ నుంచి రెండు పులులను సంపాదించి అల్లారుముద్దుగా పెంచుకునేవారు. లెపార్డ్‌, జాగ్వర్‌లకు పుట్టిన హైబ్రీడ్‌ పులికి ‘యశా’, బ్లాక్‌పాంథర్‌కు ‘సబ్రినా’ అని పేర్లు పెట్టుకుని గత రెండేళ్లుగా పోషిస్తున్నారు. యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియోలతో ఆయన జాగ్వర్‌ కుమార్‌గా పేరుపొందారు. యుద్ధం కారణంగా అన్నీ అమ్ముకుని, పెంపుడు పులులను ఓ రైతు వద్ద వదిలిపెట్టి పోలండ్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు వాటిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు లేదా వేరే ఏ దేశానికైనా తరలించడానికి సాయం అందించాలని ఆయన కోరుతున్నారు. ఈ విషయంలో కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని