సాహితీవేత్త, పరిశోధకుడు గంగప్ప మృతి

సాహితీవేత్త, పరిశోధకుడు, ఏఎన్‌యూ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ ఎస్‌.గంగప్ప(85) శుక్రవారం మృతి చెందారు. గురువారం సాయంత్రం ఛాతి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

Published : 08 Oct 2022 03:43 IST

గుంటూరు(ఎస్వీఎన్‌కాలనీ), న్యూస్‌టుడే: సాహితీవేత్త, పరిశోధకుడు, ఏఎన్‌యూ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ ఎస్‌.గంగప్ప(85) శుక్రవారం మృతి చెందారు. గురువారం సాయంత్రం ఛాతి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించినట్లు గంగప్ప అల్లుడు గుమ్మా సాంబశివరావు తెలిపారు. గంగప్పకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లగొండ్రాయనిపల్లిలో గంగప్ప జన్మించారు. 1978లో ఏఎన్‌యూలో తెలుగు అధ్యాపకునిగా చేరి రీడర్‌గా, ఆచార్యులుగా, విభాగాధిపతిగా పనిచేసి 1996లో ఉద్యోగ విరమణ పొందారు. సుమారు 100 పుస్తకాలు, పలు పత్రికల్లో సాహిత్య వ్యాసాలు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ పొందారు. సాహిత్య సేవలకుగాను పలు అవార్డులు అందుకున్నారు. గుంటూరు ఎస్వీఎన్‌ కాలనీలోని స్వగృహంలో గంగప్ప భౌతికకాయాన్ని సాహిత్య అభిమానులు, విద్యార్థులు సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని