డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ

రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రధాన ఉద్యోగ సంఘాలతో (జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌) ఏడాది కిందట జరిగిన చర్చల్లో భాగంగా ఆర్థిక శాఖతో ముడిపడిన 40 డిమాండ్లను ప్రభుత్వం నేటికీ పరిష్కరించలేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు.

Published : 08 Oct 2022 03:40 IST

నవంబరు 1 నాటికి ప్రకటిస్తాం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రధాన ఉద్యోగ సంఘాలతో (జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌) ఏడాది కిందట జరిగిన చర్చల్లో భాగంగా ఆర్థిక శాఖతో ముడిపడిన 40 డిమాండ్లను ప్రభుత్వం నేటికీ పరిష్కరించలేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. ఈ డిమాండ్లపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, కార్యదర్శి సత్యనారాయణను కలిసి చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే నవంబరు ఒకటో తేదీనాటికి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈలోగా 26 జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సచివాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘2004 సెప్టెంబరునాటికి నియామకం పొందిన ఉద్యోగులకు పాత పింఛను వర్తించేలా కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. అకాలమరణం పొందిన ఉద్యోగి కుటుంబానికి (ఉద్యోగి, ప్రభుత్వం జమ చేసే) సంయుక్త నిధి నుంచి 50 శాతం బాధిత కుటుంబానికి చెల్లించాలన్న నిబంధన, ప్రభుత్వం పీఎఫ్‌ వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని 10నుంచి 14శాతానికి పెంచాలన్న కేంద్రం ఉత్తర్వులను రాష్ట్రం పాటించడం లేదు. పీఎఫ్‌ వాటాపై ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న విధానంలో అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తుందని మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న రావత్‌ అప్పట్లో చెప్పారు. మిగిలిన డిమాండ్లపై సెప్టెంబరు ఆఖరుకు స్పష్టమైన మార్గదర్శకాలిస్తామని చెప్పినా అమలు కాలేదు’ అని పేర్కొన్నారు.

డీఏ బకాయిలు ఎప్పుడిస్తారు?
‘ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదు. 2018 జులై, 2019 జనవరికి సంబంధించి రెండు డీఏ బకాయిలను చెల్లించాలి. ఒక్కొక్క డీఏకు సంబంధించి 30 నెలలకు చెల్లించాల్సిన బకాయిలను పాత పింఛను విధానంలో ఉన్నవారికి జీపీఎఫ్‌లో జమ చేస్తామని, సీపీఎస్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులకు నగదు రూపేణా చెల్లించేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికీ అమలు కాలేదు. బకాయిలు చెల్లించినట్లు చూపి ఉద్యోగులనుంచి ఆదాయ పన్ను మాత్రం మినహాయించారు. 2022 జనవరి, జులై నెలల్లో చెల్లించాల్సిన డీఏ బకాయిలు మళ్లీ బాకీ పడింది. వాటిని తక్షణం మంజూరుచేసి బకాయిల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని