అన్నమయ్య వరద బాధితులకు న్యాయం చేస్తాం

అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట గతేడాది నవంబరులో తెగిపోయింది. ఆ నష్టాన్ని అంచనా వేయడానికి, ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవడానికి హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ శుక్రవారం జిల్లాకు వచ్చారు.

Published : 08 Oct 2022 03:40 IST

జలాశయం ప్రాంతాలను పరిశీలించిన హైకోర్టు న్యాయవాది

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట గతేడాది నవంబరులో తెగిపోయింది. ఆ నష్టాన్ని అంచనా వేయడానికి, ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవడానికి హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ శుక్రవారం జిల్లాకు వచ్చారు. గతంలో ఆయన భాజపా తరఫున హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతున్నందున న్యాయవాది.. రాజంపేట మండలంలోని వరద గ్రామాలను సందర్శించారు. అనంతరం పులపుత్తూరు, మందపల్లి, తోగురుపేట, మందపల్లి గ్రామాలను పరిశీలించారు. బాధితుల తరఫున పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.200 కోట్లు చెల్లించిందని ఆయన తెలపగా, తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని బాధితులు వాపోయారు. ఆయన వెంట భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, రాజంపేట నియోజకవర్గ బాధ్యుడు పి.రమేష్‌నాయుడు, పట్టణ కార్యదర్శి నాగరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణరాజు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని