శ్రీవారిని దర్శించుకున్న సీజే

శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, అభిషేక సేవలో పాల్గొన్నారు.

Published : 08 Oct 2022 03:40 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తితిదే ఈవో ధర్మారెడ్డి వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.

* హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జయసూర్య, జస్టిస్‌ దుర్గాప్రసాద్‌రావు, జస్టిస్‌ వి.శ్రీనివాస్‌ శుక్రవారం అభిషేకం, వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts