భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరకలు

కృష్ణా ఎగువ పరివాహకంలో రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం నదికి వరద పెరిగింది.

Published : 08 Oct 2022 03:40 IST

నాగార్జునసాగర్‌ 20 గేట్లు ఎత్తివేత

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: కృష్ణా ఎగువ పరివాహకంలో రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం నదికి వరద పెరిగింది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 82,025 క్యూసెక్కుల వరద వస్తుండగా, శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 2,15,770 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌లోని ఇరవై గేట్ల ద్వారా 1,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి కాలువకు 9,062, ఎడమ కాలువకు 6,656, జల విద్యుత్తు కేంద్రానికి 32,882, ఎస్‌ఎల్‌బీసీకి 2,400 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. మొత్తంగా 2,12,868 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో నీటిమట్టం 590 అడుగులకు చేరింది. ఇది 312 టీఎంసీలకు సమానం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని