Andhra News: నడుస్తుండగానే ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు

నడుస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

Updated : 11 Oct 2022 07:22 IST

ఆకివీడు, న్యూస్‌టుడే: నడుస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వెంటనే బస్సు నిలిచిపోవడంతో దానిలో ఉన్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. నరసాపురం డిపోకు చెందిన బస్సు  జాతీయ రహదారి మీదుగా ఏలూరు వెళ్తుండగా అజ్జమూరు వద్ద వెనుక భాగంలో ఓ వైపున రెండు చక్రాలు ఊడిపోయాయి. ఒకటి పూర్తిగా బయటకు వచ్చింది. దీనిని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేశారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు ఒరిగిపోవడంతో దానిలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వారిని వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపారు. గోతులమయంగా ఉన్న రహదారుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు