Maredumilli: శభాష్‌ డ్రైవరన్న: బ్రేకులు ఫెయిలైన బస్సు.. కొండను ఢీకొట్టించి..

ఘాట్ రోడ్డులో వెళ్తున్న బస్సుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిలవడంతో డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం భద్రాచలం నుంచి కాకినాడ బయలుదేరింది.

Updated : 20 Oct 2022 09:27 IST

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ఘాట్ రోడ్డులో వెళ్తున్న బస్సుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిలవడంతో డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం భద్రాచలం నుంచి కాకినాడ బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా  మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో వాలమూరు సమీపంలోకి వచ్చే సరికి బ్రేకులు ఫెయిలైనట్లు డ్రైవర్‌ సుబ్బారావు గుర్తించారు. వెంటనే అందులోని మరో డ్రైవర్‌, 36 మంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. రెండు ప్రమాదకర మలుపులు వెళ్లాక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే ఉన్న కొండను ఢీకొట్టారు. దీంతో బస్సు ముందు భాగం లోపలికి చొచ్చుకొచ్చింది. డ్రైవర్‌ కాళ్లు అందులోనే ఇరుక్కుపోయాయి. ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మారేడుమిల్లి పోలీసులు, లారీ యూనియన్‌ ప్రతినిధులు ఘటనా స్థలానికి వెళ్లి లారీతో బస్సును వెనక్కి లాగి డ్రైవర్‌ను బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి బస్సును కొండకు ఢీకొట్టించి ఆపడం వల్లే ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు డ్రైవర్‌ సుబ్బారావును అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని