Health University: ఎన్టీఆర్‌ ఆనవాళ్లు లేకుండా మార్పులు

విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వర్సిటీగా మార్చడానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేసి 24 గంటలు కాక ముందే అక్కడ పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

Updated : 02 Nov 2022 09:33 IST

ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వర్సిటీగా మార్చడానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేసి 24 గంటలు కాక ముందే అక్కడ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత వెబ్‌సైట్‌లో పాత పేరును తొలగించి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అని చేర్చారు. అలాగే 1986లో రూపొందించిన ఎంబ్లమ్‌(చిహ్నం)లోనూ మార్పు చేశారు. ఉపకులపతి, రిజిస్ట్రార్‌ నేమ్‌బోర్డుల్లో డాక్టర్‌ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అని రాశారు. విశ్వవిద్యాలయం భవనం పైభాగాన ఉన్న ఎన్టీఆర్‌ పేరును తొలగించే ఏర్పాట్లలో భాగంగా కొలతలు తీసుకుంటున్నారు. అన్ని విభాగాల్లో, ప్రతి కంప్యూటర్‌, వస్తువులు, టేబుళ్లు, అల్మారాలపై ఉన్న ఎన్టీఆర్‌ పేరు లేకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయా విభాగాల ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని