MLC Bhageeratha Reddy: అత్యంత విషమంగా ఎమ్మెల్సీ భగీరథరెడ్డి ఆరోగ్యం

ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు.

Updated : 02 Nov 2022 08:54 IST

హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స

ఈనాడు, కర్నూలు: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు. నంద్యాల జిల్లా అవుకులోని తన స్వగృహం నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతుండటంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ బంధువు చల్లా రఘునాథరెడ్డి మాట్లాడుతూ... భగీరథరెడ్డికి వెంటిలేటర్‌పై మొదట 100 శాతం ఆక్సిజన్‌ ఇచ్చారని, ప్రస్తుతం   60 శాతానికి తగ్గించారని, శరీరం చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని