Andhra News: మరమ్మతులు అన్నారు.. పాదయాత్ర ఆపారు.. చివరకు అలానే వదిలేశారు..!

రాజమహేంద్రవరం-కొవ్వూరు వంతెనపై రాకపోకలను గత నెలలో మరమ్మతుల పేరిట ఆపేశారు.

Updated : 07 Nov 2022 08:35 IST

రాజమహేంద్రవరం-కొవ్వూరు వంతెనపై రాకపోకలను గత నెలలో మరమ్మతుల పేరిట ఆపేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకే ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి వంతెనను మూయించి వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటికి తగ్గట్టుగానే తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టి వంతెన మీదుగా వాహనాలకు అనుమతి ఇచ్చారు. రైల్వే, ర.భ.శాఖ సంయుక్తంగా అత్యవసర మరమ్మతులంటూ గత నెల 14న రోడ్డు, రైలు వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని చెప్పి 13 రోజుల తర్వాత గత నెల 27న రాకపోకలను పునరుద్ధరించారు. తీరా చూస్తే సాధారణ నిర్వహణ పనులు తప్ప అత్యవసర కార్యాచరణ ఏమీ కనిపించలేదు. చిన్నచిన్న ఇబ్బందులూ చక్కదిద్దలేదు. చాలాచోట్ల రెయిలింగ్‌ శిథిలావస్థకు చేరి ధ్వంసమైనా కనీసం మరమ్మతులు చేయించలేదు. ఫ్యూజ్‌ బాక్సులకు మూతలూ ఏర్పాటు చేయలేదు. పలుచోట్ల ఇనుప గడ్డర్లు తుప్పుపట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్త రెయిలింగ్‌ నిర్మాణాలు తూతూమంత్రంగా చేపట్టారు. 

- న్యూస్‌టుడే, కంబాలచెరువు(రాజమహేంద్రవరం), కొవ్వూరు పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు