Vizag: సానుకూల ప్రకటనేదీ?.. జగన్ విన్నవించినా స్పందించని ప్రధాని

రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసింది. విశాఖ ఉక్కు, రైల్వేజోన్‌ అంశాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావించారు.

Updated : 13 Nov 2022 08:57 IST

ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసింది. విశాఖ ఉక్కు, రైల్వేజోన్‌ అంశాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావించారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించి ఆశీర్వదించాలని వేదికపై ప్రసంగిస్తూ ప్రత్యేకంగా నమస్కారం చేసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పలుసార్లు ప్రధానిని సార్‌...సార్‌ అంటూ సంబోధించి.. వినయపూర్వకంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించారు. అయినా ప్రధాని మోదీ మాత్రం ఎలాంటి వరాలు రాష్ట్రంపైనా, విశాఖ నగరంపై కురిపించలేదు. ప్రధాని ముందు తమ ప్రభుత్వ బలప్రదర్శన చూపి... సానుకూల ప్రకటనలు చేయించుకోవాలని ఆశపడినా నిరుత్సాహమే మిగిలిందని పలువురు భావిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని సానుకూలంగా స్పందిస్తారేమోనని ఎదురుచూసిన ఉద్యోగులు, కార్మికులకు నిరాశే మిగిలింది. రైల్వేజోన్‌ను ప్రస్తావించకపోవడం భాజపా నాయకుల్లోనూ చర్చనీయాంశమైంది.


మా మనోభావాలను కేంద్రం అర్థం చేసుకోవాలి

‘ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో సానుకూల ప్రకటన వెలువడుతుందని ఎదురుచూశాం.రాష్ట్రానికి ఏ ఒక్క నూతన హామీని ప్రధాని ఇవ్వకపోవడం బాధాకరం. ఉక్కు ఉద్యోగుల మనోభావాలను కేంద్రం అర్థం చేసుకోవాలి.’  

- ఆదినారాయణ, అధ్యక్షుడు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని