Andhra News: ఐదుగురు బలైన చోట... మళ్లీ తెగిన విద్యుత్తు తీగ

విద్యుత్తు తీగ తెగిపడి ఐదుగురు అసువులుబాసిన ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు... మరోసారి అదేచోట తీగ తెగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Updated : 23 Nov 2022 08:03 IST

బొమ్మనహాళ్‌, ఉరవకొండ, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగ తెగిపడి ఐదుగురు అసువులుబాసిన ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు... మరోసారి అదేచోట తీగ తెగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. దర్గాహొన్నూరు పరిధిలో సుబ్బన్న అనే రైతు పొలం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 11 కేవీ విద్యుత్తు తీగ తెగింది. దగ్గర్లోని తోటలో ఉన్న ఓ రైతు గుర్తించి విద్యుత్తు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సరఫరా ఆపేశారు. సమీపంలోని కూలీలు, ఇతరులు ఆ చోటు నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఎవరూ అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రమైనా తీగను సరిచేసేందుకు సిబ్బంది రాలేదు. ఈ నెల 2న అదే ప్రాంతంలో విద్యుత్తు తీగ తెగి ట్రాక్టరుపై పడటంతో అందులోని ఐదుగురు  కూలీలు మరణించారు. మరో ఇద్దరు కొనప్రాణాలతో కర్ణాటకలోని బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని