అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోసాంధ్ర, సమీప ప్రాంతాల మీద కొనసాగుతోంది.

Published : 24 Nov 2022 05:23 IST

ఈనాడు, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోసాంధ్ర, సమీప ప్రాంతాల మీద కొనసాగుతోంది. ఫలితంగా గురువారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో పలు చోట్ల అధిక వర్షపాతం నమోదైంది. ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిశాయి. బుధవారం అత్యధికంగా తడలో 94.2 మి.మీ, సూళ్లూరుపేట 88.6, గూడూరు, 38.4, ఉదయగిరి 31.4 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని