పర్యావరణ అనుమతులకు చుక్కెదురు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని రెండు జాతీయ రహదారుల విస్తరణ విషయంలో పర్యావరణ అనుమతులకు చుక్కెదురయింది.

Updated : 25 Nov 2022 05:16 IST

2 జాతీయ రహదారుల విస్తరణపై సమగ్ర నివేదిక కోరిన నిపుణుల కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని రెండు జాతీయ రహదారుల విస్తరణ విషయంలో పర్యావరణ అనుమతులకు చుక్కెదురయింది. వరంగల్‌-ఖమ్మం హరిత రహదారి, ఖమ్మం-విజయవాడ ఆర్థిక నడవాకు సంబంధించి జాతీయ రహదారుల విస్తరణకు వీలుగా పర్యావరణ అనుమతుల కోసం జాతీయ రహదారుల సంస్థ అధికారులు అడవులు, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేశారు. పరిశీలించిన నిపుణుల కమిటీ ఆయా మార్గాల్లో చేపట్టే భూసేకరణ, నష్టపరిహారం, పునరావాసం తదితర అంశాలపై మరింత సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టంచేసింది. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి పరిధిలోని మహబూబాబాద్‌, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో 440 హెక్టార్ల భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులోని 108.24 ఎకరాలకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ప్రత్యేకించి హనుమకొండ పరిధిలోని ఆగ్రంపాడ్‌, పెద్దాపూర్‌, ముత్యాలపల్లి గ్రామాల్లో సేకరణ పరిధిలోకి వచ్చిన భూములు అత్యంత విలువైనవి. భూసేకరణ సందర్భంగా కేంద్రం చెల్లించే నష్టపరిహారంతో కోల్పోయిన విస్తీర్ణాన్ని వేరే వద్ద కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు స్పష్టం చేశారు. అలాగే ఖమ్మం-విజయవాడ మార్గంలో తెలంగాణలోని వి.వెంకటాయపాలెం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని జక్కంపూడి వరకు 89.43 ఎకరాల భూసేకరణకు సంబంధించి కూడా అనుసరిస్తున్న విధానంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని