కోస్తాలో తేలికపాటి వర్షాలు!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో తూర్పు గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.

Published : 25 Nov 2022 04:26 IST

ఏయూ ప్రాంగణం (విశాఖపట్నం), న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో తూర్పు గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో ఒకటి లేక రెండుచోట్ల తేలికపాటి లేదా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లు, తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని