ఇంటి భోజనం కావాలి

దిల్లీ మద్యం కుంభకోణంలో తీహార్‌ జైలులో ఉన్న అరబిందో శరత్‌చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్‌ ప్రతినిధి బినోయ్‌బాబులకు ఇంటి భోజనానికి అనుమతించాలని వారి న్యాయవాదులు గురువారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

Published : 25 Nov 2022 04:26 IST

సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణంలో తీహార్‌ జైలులో ఉన్న అరబిందో శరత్‌చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్‌ ప్రతినిధి బినోయ్‌బాబులకు ఇంటి భోజనానికి అనుమతించాలని వారి న్యాయవాదులు గురువారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ స్పందిస్తూ.. వైద్యులు సూచిస్తే ప్రత్యేక భోజనానికి అనుమతిస్తామని, దానిని జైలు వంట గదిలోనే తయారు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా వాటర్‌ ఫ్లాస్క్‌, మందులు అందించేందుకు వెసులుబాటు కల్పించారు. తాము ఎంపిక చేసుకున్న పుస్తకాలు చదువుకునేందుకు అవకాశం కల్పించాలంటూ అరబిందో శరత్‌చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్‌ తమ న్యాయవాదుల ద్వారా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయించారు. అందుకు జడ్జి అనుమతించారు. ‘థింక్‌ లైక్‌ ఏ మాంక్‌’, ‘ఇకిగాయ్‌’  ‘వన్‌ స్మాల్‌ స్టెప్‌ కెన్‌ ఛేంజ్‌ యువర్‌ లైఫ్‌’ పుస్తకాలను వారు తెప్పించుకున్నారు.

* దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో నిందితుడైన శరత్‌చంద్రారెడ్డికి చెందిన ట్రిడెంట్‌ కెమ్‌ఫర్‌ రీటైల్‌ ఆపరేషన్స్‌ విభాగాధిపతి ఇ.చందన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 16న తన ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో ఈడీ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తూ తీవ్రంగా కొట్టారని, థర్డ్‌ డిగ్రీ పద్ధతులు ప్రయోగించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts