పెన్నాలో ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక

అనంతపురం జిల్లా తాడిపత్రి పరిసరాల్లో పెన్నానదిలోని ఇసుక అక్రమ తరలింపుపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తహసీల్దార్‌ మునివేలు తెలిపారు.

Published : 25 Nov 2022 04:50 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన

తాడిపత్రి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిసరాల్లో పెన్నానదిలోని ఇసుక అక్రమ తరలింపుపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తహసీల్దార్‌ మునివేలు తెలిపారు. వైకాపా నాయకులు నదిలో హద్దులు వేసుకుని, గేట్లను ఏర్పాటు చేసుకుని అక్రమంగా తవ్వకాలకు పాల్పడుతుండటంపై ఈ నెల 24న ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘పెన్నాను పంచేసుకున్నారు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్‌ మునివేలు పెన్నానది ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. తాము వెళ్లక ముందే గేట్లను తొలగించారని, ఎవరెవరు ఆక్రమించుకున్నారో, ఎంతవరకు ఇసుకను అక్రమంగా తరలించారో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన చెప్పారు. మైనింగ్‌ ఏడీ నాగయ్య కూడా సిబ్బందితో కలిసి పెన్నానదిలో పరిశీలించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరును జప్తు చేశామని చెప్పారు. అక్రమ తవ్వకాలపై నివేదిక తయారుచేసినట్లు తెలిపారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు, సెబ్‌ అధికారులకు లేఖ రాసినట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని