న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం

‘విజయవాడ పోలీసులు మాకు న్యాయం చేయలేదు. ముఖ్యమంత్రి మా మొర ఆలకిస్తారని వచ్చాం. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ భార్యాభర్తలు గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసం వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 25 Nov 2022 04:50 IST

సీఎం నివాసం వద్దకు వచ్చిన భార్యాభర్తలు
అదుపులోకి తీసుకున్న పోలీసులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: ‘విజయవాడ పోలీసులు మాకు న్యాయం చేయలేదు. ముఖ్యమంత్రి మా మొర ఆలకిస్తారని వచ్చాం. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ భార్యాభర్తలు గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసం వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం... రాయన జ్ఞానేంద్ర, అనూషా 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. భర్త తరఫు బంధువులు తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భార్యాభర్తలు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని తాడేపల్లి వచ్చారు. వ్యక్తిగతానివి కాకుండా సామూహిక సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాలని చెక్‌పోస్టులోని సిబ్బంది వారికి సూచించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని భార్యాభర్తలు వాపోయారు. పోరంకి పోలీసులకు ఈ అంశంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, సీఎంను కలసి సమస్య వివరిస్తామని కోరారు. వినతిపత్రాన్ని తీసుకున్న చెక్‌ పోస్టులోని సిబ్బంది తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఇరువురినీ అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని