రీ-సర్వే తుది జాబితా ప్రకటించినా అప్పీళ్లకు అవకాశం

రీ-సర్వే పూర్తయి భూ యాజమాన్య రికార్డుల్లో (ఆర్‌ఓఆర్‌) వివరాలు నమోదు జరిగినట్లు తుది జాబితా ప్రకటించిన నాటి నుంచి ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ పట్టాదారు పాస్‌బుక్‌ నిబంధనల మేరకు 90 రోజుల్లోగా అప్పీల్‌ లేదా అభ్యంతరాలు తెలియచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated : 25 Nov 2022 06:14 IST

ఈనాడు, అమరావతి: రీ-సర్వే పూర్తయి భూ యాజమాన్య రికార్డుల్లో (ఆర్‌ఓఆర్‌) వివరాలు నమోదు జరిగినట్లు తుది జాబితా ప్రకటించిన నాటి నుంచి ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ పట్టాదారు పాస్‌బుక్‌ నిబంధనల మేరకు 90 రోజుల్లోగా అప్పీల్‌ లేదా అభ్యంతరాలు తెలియచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాలకు ఆదేశాలు వచ్చాయి. రీ-సర్వే సమయంలో తాము అందుబాటులో లేమని, సమాచారం ఇవ్వలేదని రైతులు చెబుతున్నట్లు గుంటూరు, ఇతరచోట్ల అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అమల్లో ఉన్న నిబంధనలపై మరోసారి ప్రజలకు వివరించాలని ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు వచ్చాయి. వేర్వేరు ప్రాంతాల్లో యజమానులు/రైతులు తమ అభ్యంతరాలను వాట్సప్‌ కాల్స్‌, జూమ్‌ కాల్స్‌ ద్వారా తెలియచేస్తే పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రీ-సర్వే సమయంలో భౌతికంగా హాజరుకాలేదని కారణం చూపుతూ రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తిరస్కరించకూడదన్నారు. అలాగే తమ తరఫున ఎవరిద్వారానైనా సమాచారాన్ని పంపిస్తే దానిని కూడా పరిగణనలోకి తీసుకుని, ఆ విధంగానే రికార్డుల్లో నమోదుచేయాలని తెలిపారు. రీ-సర్వే ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు భూ యజమానులకు తెలియబరిచిన విధానంపై తగిన ఆధారాలతో రికార్డుల్లో స్పష్టంగా నమోదుచేయాలని సూచించారు. రీ-సర్వేలో తలెత్తే వివాదాలపై ఆర్బిటరేషన్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts