ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 11న మహాసభ

రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ డిసెంబరు 11న రాష్ట్ర సర్వజన మహాసభను విజయవాడలో నిర్వహించనున్నట్లు ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ప్రకటించింది.

Published : 25 Nov 2022 05:40 IST

ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం

విజయవాడ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ డిసెంబరు 11న రాష్ట్ర సర్వజన మహాసభను విజయవాడలో నిర్వహించనున్నట్లు ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ప్రకటించింది. సభకు ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి హాజరవుతారంది. గురువారం విజయవాడలో సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ‘వైద్యారోగ్య శాఖలో పైనుంచి కింది స్థాయి వరకు పనిభారం అధికంగా ఉంది. వైయస్‌ఆర్‌ క్లినిక్‌, ఇతర సర్వేల పేరిట ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని సంఘం అధ్యక్షుడు ఆస్కారరావు, ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమణ, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, శివయ్య, ఇతర నేతలు మాట్లాడారు. అనంతరం తీర్మానించిన అంశాలతో సంఘం పత్రికా ప్రకటన జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని