బీఎమ్‌ శశిధర్‌ మృతిపై విచారణ చేపట్టాలి

తిరుపతిలో ఈనెల 8న రిమాండ్‌లో ఉన్న హన్స్‌ ఇండియా పాత్రికేయుడు బీఎమ్‌ శశిధర్‌ ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌(ఏపీడబ్ల్యూజేఎఫ్‌) ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కోరారు.

Published : 25 Nov 2022 05:40 IST

ఏపీడబ్ల్యూజేఎఫ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తిరుపతిలో ఈనెల 8న రిమాండ్‌లో ఉన్న హన్స్‌ ఇండియా పాత్రికేయుడు బీఎమ్‌ శశిధర్‌ ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌(ఏపీడబ్ల్యూజేఎఫ్‌) ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కోరారు. ఈ మేరకు మంగళగిరిలోని కార్యాలయంలో డీజీపీని గురువారం ఆయన కలిసి వినతిపత్రం అందించారు. ‘శశిధర్‌ రెండు దశాబ్దాలుగా తిరుపతిలో పనిచేస్తున్నారు. గతంలో ఆయనకు ఎలాంటి నేరచరిత్ర లేదు. పాత్రికేయునిగా చాలా సాధారణ జీవితం సాగించారు. అనూహ్యంగా మత్తు పదార్థాల అమ్మకాల కేసులో ఇరుక్కున్నారు. కేసుపై అనుమానాలున్నప్పటికీ నిజం నిలకడ మీద తెలుస్తుందనుకున్నాం. రిమాండ్‌లో ఉన్న వ్యక్తి అనారోగ్యంపాలైతే వెంటనే ఆసుపత్రికి తరలించకపోవడం...తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పడం, హఠాత్తుగా చనిపోవడం చూస్తే మొత్తం సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుతోపాటు శశిధర్‌ మృతిపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలి’ అని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో భాజపా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కన్వీనర్‌ అబ్దుల్‌ అలీమ్‌, సాంబశివరావు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts