శరవేగంగా అంబేడ్కర్‌ విగ్రహ పనులు

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ఆవిష్కరించడానికి వీలుగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని వేగంగా చేయిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.

Updated : 25 Nov 2022 06:08 IST

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ఆవిష్కరించడానికి వీలుగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని వేగంగా చేయిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం అధికారులతో మంత్రి సమీక్షించారు. ‘హరియాణాలో విగ్రహం పోత పనులు మొదలయ్యాయి. విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో విగ్రహం ఏర్పాటుకు వీలుగా అక్కడున్న పాత భవనాల తొలగింపు పూర్తయింది. దాని చుట్టూ భవనాల నిర్మాణం వేగంగా సాగుతోంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అవసరమైన 24 మీటర్ల టవర్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి’ అని వెల్లడించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts