మృత్యువుతో పోరాడి ఓడిన దర్శిత్
ఆ చిట్టి తండ్రి ఎదిగివస్తే పెద్దయ్యాక తమను నడిపిస్తాడని ఆశించారు. అనుకోని ప్రమాదానికి గురై కాళ్లు తొలగిస్తే.. పోనీ బతికి వస్తే చాలు తమ కాళ్లతో నడిపిద్దామనుకున్నారు. కానీ... వారి ఆశలు ఫలించలేదు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు, బంధువులు
కాకినాడ, న్యూస్‌టుడే: ఆ చిట్టి తండ్రి ఎదిగివస్తే పెద్దయ్యాక తమను నడిపిస్తాడని ఆశించారు. అనుకోని ప్రమాదానికి గురై కాళ్లు తొలగిస్తే.. పోనీ బతికి వస్తే చాలు తమ కాళ్లతో నడిపిద్దామనుకున్నారు. కానీ... వారి ఆశలు ఫలించలేదు. ఆ తల్లిదండ్రుల ఆశలను వమ్ముచేస్తూ మూడేళ్లకే లోకం విడిచి వెళ్లిపోయాడు. విద్యుదాఘాతానికి గురై 14 రోజులపాటు మృత్యువుతో పోరాడిన దర్శిత్(3) శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి వినోద్, చాందినిలకు ఇద్దరు కుమారులు సంతానం. తల్లి ఈనెల 12న డాబాపై దుస్తులు ఆరేయడానికి పైకి వెళ్లడంతో ఆమెతోపాటు చిన్న కుమారుడు దర్శిత్ కూడా వెళ్లాడు. డాబా పైనుంచి 33 కేవీ విద్యుత్తు తీగలు వెళ్తుండడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా... వైద్యులు మోకాలి కింద వరకు రెండు కాళ్లూ తొలగించారు. బాలుడి దీనావస్థపై ‘ఈనాడు’లో ఈనెల 21న ‘చిన్నా.. ఏవిరా నీ కాళ్లు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో.. దర్శిత్‌కు మెరుగైన వైద్య సాయం కోసం దేశవిదేశాల్లోని మానవతావాదులు స్పందించి రూ.40 లక్షల వరకు సాయం అందజేశారు. ఆ పసివాడు కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు. దర్శిత్ గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ఐసీయూకి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కుడికాలికి ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో మరోసారి శస్త్ర చికిత్స నిర్వహించి మోకాలి పైవరకు తొలగించారు. అంతా సక్రమంగా ఉండడంతో వార్డుకు తరలించారు. అనంతరం గుండె కొట్టుకోవడం మందగించడంతో శుక్రవారం సాయంత్రం ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు. అయితే ఉదయం మరొక శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారని, ఈలోపు హోం మినిస్టర్ తానేటి వనిత రావడంతో ఆపరేషన్ ఆలస్యం చేశారని దర్శిత్ తల్లి చాందిని ఆవేదన వ్యక్తంచేశారు.
14 రోజులుగా కన్నీళ్లతోనే...
దర్శిత్ మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. చికిత్స పొందుతున్నాడు కదా.. నయమై ఇంటికి వస్తాడని ఆశిస్తే ఇలా విగతజీవిగా మారిపోయాడంటూ వారు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. తమ డాబా మీదుగా వెళ్తున్న విద్యుత్తు వైర్లను తొలగించమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని దర్శిత్ బాబాయ్ చిట్టబ్బాయి ఆవేదన వ్యక్తం చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా