5న విజయవాడకు రాష్ట్రపతి రాక

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వచ్చే నెల 5న విజయవాడ పర్యటనకు రానున్నారు. రూ.2,013 కోట్ల విలువైన 154 కి.మీ. మేర జాతీయ రహదారుల ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

Updated : 26 Nov 2022 05:18 IST

రూ.2వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

ఈనాడు,అమరావతి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వచ్చే నెల 5న విజయవాడ పర్యటనకు రానున్నారు. రూ.2,013 కోట్ల విలువైన 154 కి.మీ. మేర జాతీయ రహదారుల ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాయచోటి-అంగళ్లు సెక్షన్‌లో 60 కి.మీ., తిరుపతి వద్ద ఎన్‌హెచ్‌-71పై నిర్మించిన నాలుగు వరుసల ఆర్వోబీ, కర్నూలు టౌన్‌లోని ఐటీసీ కూడలి, డోన్‌లోని కంభలపాడు కూడలి..  3.2 కి.మీ మేర ఆరు వరుసల గ్రేడ్‌ సెపరేటర్‌ రహదారులను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ-పుట్టపర్తి మధ్య 32 కి.మీ. రెండు వరుసల రహదారి పనికి రాష్ట్రపతి శంకుస్థాపన చేస్తారు.

గడ్కరీ చేతులమీదగా రూ.9,213 కోట్ల పనులు

కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈనెల 27, 28 తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. 27వ తేదీ రాత్రి తిరుమలకు చేరుకొని అక్కడే బసచేస్తారు. 28న ఉదయం శ్రీవారి దర్శనం తర్వాత, తిరుపతికి వెళ్లి రూ.9,213 కోట్ల విలువైన ఎన్‌హెచ్‌ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని