Andhra News: జగనన్న గోరుముద్ద తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత

శ్రీసత్యసాయి జిల్లా కదిరి పాఠశాలలో శుక్రవారం జగనన్న గోరుముద్ద తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కదిరి వీవర్స్‌ కాలనీలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో 148 మంది విద్యార్థులు చదువుతున్నారు.

Updated : 26 Nov 2022 07:36 IST

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పాఠశాలలో శుక్రవారం జగనన్న గోరుముద్ద తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కదిరి వీవర్స్‌ కాలనీలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో 148 మంది విద్యార్థులు చదువుతున్నారు. శుక్రవారం పాఠశాలకు 121 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పాఠశాలలో వండిన భోజనం మాడిపోయి ఉండటాన్ని గుర్తించిన విద్యార్థులు.. ప్రధానోపాధ్యాయురాలు లావణ్య దృష్టికి తీసుకెళ్లారు. తిరిగి వండాలని ఆమె భోజన ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. కొత్తగా వండిన భోజనం ఉడకకముందే పిల్లలకు వడ్డించారు. తిన్న 8మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు. వారిని ఉపాధ్యాయ సిబ్బంది ఆటోలో కదిరి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మరో 17 మంది పిల్లలు అస్వస్థతకు గురవడంతో వారినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. భోజనం సరిగా ఉడకకపోవడం, ఆహార పదార్థాల నాణ్యతవంటి కారణాలతో పిల్లలు అస్వస్థతకు గురై ఉండొచ్చని జిల్లా వైద్యాధికారి ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో విద్యార్థులను ఆయన పరామర్శించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. తెదేపా మాజీ శాసనసభ్యుడు చాంద్‌బాషా, పార్టీ నాయకులు, సీపీఐ నాయకులు విద్యార్థులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని