పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలి

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Published : 26 Nov 2022 04:41 IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో దిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర బడ్జెట్‌ ముందస్తు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం.. సమావేశంలో చర్చించిన అంశాలపై రాజేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యతలు, అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. విద్యా, వైద్యం, సామాన్య ప్రజలకు అండగా ఉండటంపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మూలధన వ్యయంపై ఇచ్చే స్వల్పకాలిక రుణాలను వచ్చే ఏడాదికి కూడా పొడిగించాలనే ప్రతిపాదనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలోని నీటి పథకాలకు నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. పీఎం ఆవాస్‌ యోజనలో భాగంగా గృహ నిర్మాణాలకు నిధులిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర భాగస్వామ్యం లేనందున ఈ అంశాన్ని కూడా పీఎంఏవైలో చేర్చాలని సూచించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని