ఇనుము, ఇసుక ఇవ్వలేదు.. బిల్లూ రాలేదు!
‘ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తాం... వెంటనే పనులు చేపట్టండి. లేదంటే ఇంటి పట్టాను వెనక్కి ఇచ్చేయండని అధికారులు పలుమార్లు చెప్పడంతో... అప్పు చేసి నాలుగు నెలల క్రితం నిర్మాణం ప్రారంభించాను.
ప్రకాశంలో అధికారుల ఎదుట గృహ లబ్ధిదారుల ఆవేదన
త్రిపురాంతకం, న్యూస్‌టుడే: ‘ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తాం... వెంటనే పనులు చేపట్టండి. లేదంటే ఇంటి పట్టాను వెనక్కి ఇచ్చేయండని అధికారులు పలుమార్లు చెప్పడంతో... అప్పు చేసి నాలుగు నెలల క్రితం నిర్మాణం ప్రారంభించాను. ఇప్పటి వరకు కేవలం పది సిమెంట్ బస్తాలు మాత్రమే ఇచ్చారు. ఇనుము, ఇసుకతో పాటు ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదు. దీంతో పనులు ఆపేయాల్సి వచ్చింది. అప్పులిచ్చిన వారు అడుగుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు’ అంటూ ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చెందిన జగనన్న ఇంటి లబ్ధిదారు అద్దూరి రాములమ్మ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. త్రిపురాంతకంలోని జగనన్న కాలనీలో ఎంపీడీవో మరియదాసు అధ్యక్షతన శుక్రవారం హౌసింగ్ డే నిర్వహించారు.
మండల ప్రత్యేక అధికారి, డీఆర్డీఏ పీడీ బాబూరావు మాట్లాడుతూ... లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని, సకాలంలో బిల్లులు చెల్లించడంతో పాటు... పొదుపు మహిళలకు ప్రత్యేక రుణాలు ఇప్పించి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో లబ్ధిదారు రాములమ్మ తన గోడు వెళ్లబోసుకున్నారు. మిగతావారూ తమ కష్టాలను ఏకరవు పెట్టారు. ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేదని, ప్రభుత్వం కట్టించి ఇస్తామంటేనే పట్టాలు తీసుకున్నామని తెలిపారు. అధికారుల మాటలతో తరువాత మేమే పనులు ప్రారంభించినా బిల్లులు రాలేదన్నారు. మరికొందరు మహిళలు తమకు పొదుపు సంఘాల్లో సభ్యత్వం లేదని చెప్పడంతో... మూడు రోజుల్లో వారికి సభ్యత్వం కల్పించి రుణం అందించాలని స్థానిక సిబ్బందికి పీడీ సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత