న్యాయమూర్తుల బదిలీపై లాయర్ల నిరసన
న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్‌ల ఆకస్మిక బదిలీ ప్రక్రియపై ఏపీ హైకోర్టులో నిరసనలు వెల్లువెత్తాయి. న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు.
హైకోర్టులో విధులు బహిష్కరించి ర్యాలీ
హైకోర్టు న్యాయవాదుల సంఘ సభ్యుల అత్యవసర సమావేశం
బదిలీలను నిలిపేయాలని సీజేఐకి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం
ఈనాడు, అమరావతి: న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్‌ల ఆకస్మిక బదిలీ ప్రక్రియపై ఏపీ హైకోర్టులో నిరసనలు వెల్లువెత్తాయి. న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. నెక్బ్యాండ్లను తొలగించి నిరసన తెలిపారు. శుక్రవారం కోర్టు ప్రారంభ సమయంలో ప్రతి కోర్టు హాలుకు వెళ్లి అక్కడున్న న్యాయవాదులను విధుల బహిష్కరణకు సహకరించాలని కోరారు. బదిలీలపై శాంతియుత నిరసన చేపట్టినట్లు న్యాయమూర్తులకు తెలియజేశారు. న్యాయవాదులందరూ కోర్టు హాళ్ల నుంచి బయటకు రావడంతో కేసులను వాయిదా వేస్తూ న్యాయమూర్తులు బెంచ్ దిగిపోయారు. ఆ తర్వాత న్యాయవాదులందరూ హైకోర్టు వెలుపలకు వచ్చి.. అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని నినదించారు. హైకోర్టు వద్ద ఉన్న జాతీయ పతాకం నుంచి సమీపంలోని క్యాంటీన్ వరకు ర్యాలీ చేపట్టారు. పేదలు, అణగారిన వర్గాలకు సైతం న్యాయం జరుగుతుందన్న భరోసా వారి తీర్పుల ద్వారా కల్పించి ప్రజా న్యాయమూర్తులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరినీ ఏకపక్షంగా, సరైన కారణం లేకుండా ఆకస్మికంగా బదిలీ చేయడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. వీరి బదిలీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై నిష్పక్షపాతంగా తీర్పులిస్తున్నందునే కక్షసాధింపుగా వారిని బదిలీ చేయించారన్నారు. ఇది మిగిలిన న్యాయమూర్తుల పనివిధానంపై ప్రభావం చూపుతుందన్నారు. అటెండర్ అయినా ఐఏఎస్ అయినా కోర్టు దృష్టిలో అందరూ సమానమే అనేంత నిష్పాక్షికంగా ఆ న్యాయమూర్తులు వ్యవహరించారన్నారు. అలాంటి వారిని రాత్రికి రాత్రి బదిలీ చేస్తే హైకోర్టు, న్యాయవాదులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. న్యాయమూర్తులకు ఇబ్బంది తలెత్తితే వారు బయటకు వచ్చి మాట్లాడలేరు కాబట్టి వారి పక్షాన న్యాయవాదులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో న్యాయవాదులందరూ ఒక్కమాటపై నిలబడి అక్కడి న్యాయమూర్తి బదిలీని నిలిపేయించుకున్నారని.. అదే తరహాలో మనం కూడా ఏకతాటిపై వచ్చి బదిలీలను ఆపించుకోవాలన్నారు. ఇవి సాధారణ బదిలీల్లా తాము భావించడం లేదన్నారు.
తీర్మానాలకు మద్దతుగా సంతకాల సేకరణ
హైకోర్టు న్యాయవాదుల సంఘ సభ్యులు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. బదిలీ ప్రక్రియను నిలిపేసి ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టులోనే కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు. అసంబద్ధ బదిలీలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. బదిలీలను ఖండించడంతోపాటు ఇద్దరు జడ్జీలను ఇక్కడే ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టేలా చూడాలని ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌ను కోరుతూ తీర్మానం చేశారు. వాటికి మద్దతుగా వందల మంది న్యాయవాదులు సంతకాలు చేశారు. విధుల బహిష్కరణను కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే), న్యాయవాదులు జీవీ శివాజీ, జడ శ్రావణ్‌కుమార్, నల్లూరి మాధవరావు, కేఎం కృష్ణారెడ్డి, బొక్కా సత్యనారాయణ, సువ్వారి శ్రీనివాసరావు, నాగూరు నాగరాజు, ఎం.లక్ష్మీనారాయణ, పదిరి రవితేజ, తానికొండ చిరంజీవి, పీటా రామన్, సలీం పాషా, నర్రా శ్రీనివాసరావు, కోటా వెంకట రామారావు, ఎస్.ప్రణతి, యాగంటి సుష్మ, సుదీప్తి, జంపని శ్రీదేవి, దేవీ సత్యశ్రీ నేతృత్వంలో న్యాయవాదులు భారీగా పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
* తాము ఎలాంటి విధుల బహిష్కరణకు పిలుపు ఇవ్వలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకీరామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఓ న్యాయవాద సమూహం చేసిన తీర్మానానికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి గుర్తింపు లేదన్నారు.
ప్రభుత్వానికి ఆపాదించొద్దు: ఏఏజీ
అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను గర్హిస్తున్నామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత