మరో రూ.1,500 కోట్ల రుణ సమీకరణకు సమాయత్తం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో రూ.1,500 కోట్ల బహిరంగ మార్కెట్‌లో రుణాన్ని సమీకరించనుంది. రిజర్వుబ్యాంకు మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని రుణంగా తీసుకోనుంది.

Updated : 26 Nov 2022 06:05 IST

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో రూ.1,500 కోట్ల బహిరంగ మార్కెట్‌లో రుణాన్ని సమీకరించనుంది. రిజర్వుబ్యాంకు మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వుబ్యాంకు శుక్రవారం విడుదల చేసిన జాబితా వెల్లడించింది. ఇప్పటికే తొమ్మిది నెలల కాలానికి సంబంధించి నికర రుణ పరిమితిని దాటిన ఏపీ ప్రభుత్వం అదనపు అనుమతులకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇందులో భాగంగా రూ.1500 కోట్ల రుణాన్ని తీసుకోనుంది.

విద్యుత్తు సంస్కరణల కోటాలో...: ప్రతి ఏటా రాష్ట్రాలు విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే అదనపు రుణం పొందే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిది నెలల కాలంలో నికర రుణ పరిమితి దాటేసిన నేపథ్యంలో ఆ కోటా నుంచే కొంత మొత్తం రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,300 కోట్లు రుణాన్ని ఆ రూపేణా తీసుకోవచ్చు. ఈ కోటాలో కేంద్రం ఎంత మొత్తానికి అనుమతులు ఇచ్చిందీ తెలియరాలేదు. ఈ అదనపు రుణ అనుమతులకు దిల్లీలో మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తమ ప్రయత్నాలు చేశారు. మరో వైపు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,300 కోట్లు రుణం పొందేందుకు ఆస్కారం ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రూ.3,200 కోట్ల నే వినియోగించుకుంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు