ఏపీకి రూ.682 కోట్ల జీఎస్‌టీ పరిహారం

కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం కింద రూ.17 వేల కోట్లు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.682 కోట్లు, తెలంగాణకు రూ.542 కోట్లు దక్కింది.

Updated : 26 Nov 2022 05:35 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం కింద రూ.17 వేల కోట్లు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.682 కోట్లు, తెలంగాణకు రూ.542 కోట్లు దక్కింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో రాష్ట్రాలకు పరిహారం కింద రూ.1,15,662 కోట్లు విడుదల చేసినట్లయిందని ఆర్థిక శాఖ తెలిపింది. అక్టోబరు వరకు సెస్‌ రూపంలో రూ.72,147 కోట్లు మాత్రమే విడుదలైనా.. కేంద్రం మరో రూ.43,515 కోట్లు జతచేసి రాష్ట్రాలకు కేటాయించినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని